![]() |
![]() |
.webp)
‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకరికొకరు షో బుల్లితెర మీద ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ఈ షో ప్రసారమవుతుంది.. బుల్లితెర ఆర్టిస్టులు, సెలబ్రిటీలు తమ తమ రియల్ జంటలతో పాల్గొని సందడి చేస్తున్నారు.
ఇక ఇదే టైములో ఈ షోలో పెళ్లి కానీ జంటగా ఉన్న రాకేష్-సుజాత కూడా పాల్గొన్నారు. ఇక ఈ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ప్రోమో మొత్తమంతా సెలబ్రిటీ కపుల్స్ తో ఫన్నీగా సాగిపోయినప్పటికీ ఫైనల్ లో మాత్రం ఒక ట్విస్ట్ కనిపించింది. "రాకేష్ స్కిట్స్ చూసి నువ్వు బలవంతంగా నవ్వినా సందర్భాలు ఉన్నాయా " అని అడిగేసరికి మాట్లాడితే చాలా ఓ నవ్వుతూ ఉంటుంది సుజాత ఆవిడ జడ్జిమెంట్ వల్లనే నా స్కిట్స్ అన్నీ దొబ్బుతున్నాయి"అన్నాడు. "రాకేష్ వేరే వాళ్లకు పంపిన మెసేజెస్ నువ్వెప్పుడైనా సీక్రెట్ గా చదివావా" అని సుజాతని అడిగింది శ్రీముఖి. మాకు ఆ విషయంలో చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయి. చాలా సార్లు డిస్కషన్ కూడా అయ్యింది. ఐనా సరే సుజాత నా చాట్స్ చదువుతుంది” అని చెప్పాడు రాకేష్.
ఆడియన్స్ ముందు ఎంత ఫన్ చేసినా ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవ్వరికైనా ఇలాంటివి తప్పవు అని తెలుస్తోంది. అలా ఒకరి గురించి ఒకరు చెప్పుకుని ఇద్దరూ హర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇంతకు రాకేష్ – సుజాత మధ్య అసలు ఏం జరిగింది ? రాకేష్ ఎవరికీ అంతలా మెసేజెస్ పెట్టాడు. సుజాత ఏ మెసేజెస్ చదివి బాధపడింది అనేది తెలియాలంటే వచ్చేవారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాలి.
![]() |
![]() |